ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చెయ్యండి.

|| దృశ్యం న్యూస్ ||

ఈరోజు ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో జిల్లా సమితి సమావేశం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడుతూ, 1920 అక్టోబర్ 31వ తేదీన భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన ఈ సంఘం, కార్మికుల హక్కుల కోసం అనేక చట్టాలను సాధించి పెట్టిందని, కార్మికులకు కనీస వేతనాలు, పనిగంటలు, మరియు పని భద్రత కావాలని ఐక్యం చేసేందుకు ఏఐటీయూసీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

105వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఏఐటీయూసీ అనుబంధ సంఘాల కార్మికులు ఘనంగా జరుపాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భం ద్వారా కార్మికుల పోరాటంలో సాధించబడిన 29 చట్టాల రద్దు, పని గంటల పెంపు, మరియు కేంద్ర ప్రభుత్వ అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించారు.

ఈనెలలో దీపావళి పండుగ ఉండడంతో 30 మరియు 31వ తేదీలలో ఈ జయంతి ఉత్సవాలు నిర్వహించాలని, అందులో భాగంగా నాయకులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు టి. చక్రపాణి, నాయకులు హనుమాన్లు, దేవేందర్, అనిల్, పరుశురాం, కవిత, రాధా కుమార్, ప్రసాద్, సంపత్, స్వరూప, భారతి, సాయన్న, సాయిలు, సలీం, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment