|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ రూరల్ అభివృద్ధికి రాష్ట్ర రోడ్డు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 250 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ధర్పల్లి మండల కేంద్రంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, రూరల్ ఎమ్మెల్యే కోరిక మేరకు ప్రాంత అభివృద్ధికి 250 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్ల పునరుద్ధరణ కోసం 8 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు నిర్మాణం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు.

ధర్పల్లి మండల కేంద్రానికి వచ్చిన మంత్రిని పెద్ద ఎత్తున మహిళలు మంగళ హారతులతో స్వాగతించారు.
స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు మంత్రికి ఘనమైన సన్మానం అందించారు.
మంత్రి మాట్లాడుతూ, తమ నియోజకవర్గ అభివృద్ధికి 250 కోట్ల రూపాయల నిధులు అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి కోరారు అని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సోనియా గాంధీ పుట్టిన రోజు వరకు ప్రారంభిస్తామని, సొంత స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు అందిస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహార్ బిన్ హంధాన్ తదితరులు పాల్గొన్నారు.








