2025 నూతన సంవత్సర అమృతాదిత్య క్యాలెండర్ ఆవిష్కరణ.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అమృతాదిత్య చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 2025 నూతన సంవత్సరపు క్యాలెండర్‌ను బోధన్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఛైర్మెన్ కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, డైరక్టర్లు బుర్క శంకర్ గౌడ్, నరేష్ అప్పా, బచ్చు ప్రతాప్ గుప్తా, ప్రసాద్, ఎల్లమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆర్థిక మరియు సామాజిక రంగాల్లో అమృతాదిత్య చిట్ ఫండ్ సంస్థ ఎంతగానో సమాజానికి సేవలు అందిస్తున్నదని అభిప్రాయపడ్డారు. సంస్థ అధికారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, 2025 సంవత్సరానికి అమృతాదిత్య చిట్ ఫండ్ సంస్థ మరిన్ని సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment