2024-25 సంవత్సరం గాను ఉపాధ్యాయుల కొలువులకు దరఖాస్తులకు ఆహ్వానం.

|| దృశ్యం న్యూస్ ||

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ద్వారా 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వ డైట్, నేరేడ్ మెట్, మరియు హైదరాబాద్ కళాశాలలకు అనుగుణమైన పోస్టుల కోసం అర్హత గల ఉపాధ్యాయుల దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారుల ద్వారా పాఠశాల విద్యా సంచాలకులు అధికారిక ఆదేశాలు జారీ చేశారు.

అనుబంధమైన తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లో 5 పోస్టులు,
ఉర్దూ మీడియంలో 5 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

ఉపాధ్యాయులుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారు, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం, ఐ.డి.ఓ.సి రూమ్ నెం. 103, నిజామాబాద్ కార్యాలయంలో సంబంధిత దరఖాస్తులను సమర్పించుకోవాలి. దరఖాస్తు గడువు మరియు అర్హతల వివరాలను నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ నుండి తెలుసుకోవచ్చు.

Join WhatsApp

Join Now

Leave a Comment