|| దృశ్యం న్యూస్ ||
21-03-2025 నుండి 04-04-2025 వరకు జరిగే (SSC) పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సందర్భంగా, జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటన ప్రకారం, మొత్తం 68 పరీక్ష కేంద్రాలలో 163 BNSS సెక్షన్ అమలు చేయడం జరిగింది అని, ఈ సమయంలో సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేసి పరీక్ష కేంద్రాల వద్ద 500 మీటర్ల పరిధిలో జన సమూహం నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పరీక్షలు ప్రారంభం అయ్యే సమయం నుంచి పటిష్ట భద్రతా చర్యలు అమలు చేయాలని, పోలీసు అధికారులు కూడా పరీక్ష కేంద్రాల వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తారని చెప్పారు.
పరీక్ష పత్రాలు పోలీసు స్టేషన్ల నుండి పరీక్ష కేంద్రాలకు జాగ్రత్తగా చేరేలా ఎస్కార్ట్ సిబ్బంది ఉండాలని ఆదేశించారు.
పరీక్షల సమయానికి గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలని, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.








