|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 108 అంబులెన్సు సర్వీసులలో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. ఈఏంఅర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూ లు నిర్వహించబోతున్నట్లు ప్రోగ్రాం మేనేజర్ గాధం మధుకుమార్ మరియు జిల్లా కోఆర్డినేటర్ పెండ్యాల శ్రీకాంత్ తెలిపారు.
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు BSc (BZC), MLT, DMLT, BSc Nursing, ANM, GNM డిగ్రీలతో ఉండాలి. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని, అభ్యర్థులు ఒరిజినల్ మరియు జిరాక్స్ ధ్రువపత్రాలతో ఇంటర్వ్యూకి హాజరుకావాలని సూచించారు.
ఇంటర్వ్యూ వివరాలకు మరియు ఇతర సమాచారం కోసం 9100799161, 8074652252 నంబర్లను సంప్రదించవచ్చని తెలియజేశారు.








