|| దృశ్యం న్యూస్ ||
బోధన్ మున్సిపల్ సర్వ సభ్య సమావేశంలో మొత్తం 10 ఆజెండా అంశాలు చర్చకు రావడంతో 10 అంశాలు ఆమోదం పొందాయి.
మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి అధ్యక్షతన శనివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సర్వ సభ్య సమావేశంలో 15వ ఆర్థిక సంఘం నుండి మంజూరైన 58 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు కల్పించాలని తీర్మానించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి సభ్యుడు, ఆజెండా అంశాలకు సంబంధించి సక్రమంగా తమ అభిప్రాయాలను తెలపడం జరిగింది, బోధన్ పట్టణ అభివృద్ధికి ఈ నిర్ణయాలు కీలకంగా నిలిచాయి.
ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు సిబ్బంది పాల్గొన్నారు.








