|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు తమ ఇంటి పన్నులు, కులాయి పన్నులు, వృత్తి వ్యాపార పన్నులు సమయానికి చెల్లించాలని గ్రామపంచాయతీ కార్యదర్శి సాయిలు పేర్కొన్నారు. పన్నుల వసూళ్లు సకాలంలో జరగడానికి గ్రామపంచాయతీ సిబ్బంది ఇంటి వద్దకు వచ్చి పన్నుల వివరాలు గ్రామస్థులకు తెలియచేస్తూ వసూలు చేస్తున్నారు అని. ప్రజలు తమ పన్నులను చెల్లించడంలో సహకరించాలని, పన్నులు చెల్లించని వారు, లేదా సిబ్బందిపై దుర్భాషలాడిన వారు చట్టపరంగా కఠిన చర్యలకు గురి కావచ్చని హెచ్చరించారు.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామాభివృద్ధికి కావలసిన ఆర్థిక సాయాన్ని సమకూర్చాలని గ్రామపంచాయతీ కార్యదర్శి సాయిలు తెలిపారు.








