|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్య సేవల్లో సమయపాలన అత్యంత అవసరమని వైద్యులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ హవేలీ ఘనపూర్ మండలం సర్దన గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా డాక్టర్ల హాజరు పుస్తకాలు, మందుల నిల్వలను పరిశీలించి, రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడారు.

కలెక్టర్ మాట్లాడుతూ – “ప్రతి వైద్యుడు సమయానికి విధులకు హాజరవ్వాలి. ప్రజలకు నాణ్యమైన, ఉచిత వైద్య సేవలు అందించటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. పీహెచ్సీల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలి,” అని ఆదేశించారు. పేదలు మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు నిరంతరం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ తనిఖీలో వైద్య సిబ్బంది, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.








