|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ నాయకత్వంలో వర్ని మండలం, మోస్ర గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో సరైన పత్రాలు లేని 69 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. ప్రజలలో చట్టం పట్ల అవగాహన పెంచడం, ట్రాఫిక్ నియమాలు పాటించాలనే సందేశాన్ని అందించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బోధన్ టౌన్ సీఐ వెంకటనారాయణ, రూరల్ సీఐ విజయ్ బాబు, ఎస్సైలు సునీల్, మచ్చేందర్ రెడ్డి, చంద్రమోహన్, సాయన్న, మహేష్ సహా 70 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.








