రుద్రుర్ మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండల కేంద్రంలో ఈ రోజు రంజాన్ పండుగను ముస్లింలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
రంజాన్ మాసం ముగిసిన నేపథ్యంలో ఈగ్ధ వద్ద నమాజ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి. మత పెద్దలు ఖురాన్ సూక్తులు పఠిస్తూ ప్రసంగాలు నిర్వహించారు.

సోమవారం ఉదయం నుంచే పండుగ వాతావరణం నెలకొంది. ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ సందర్భంగా పత్తి రాము, నాగేష్ లు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో ఇమ్రాన్, మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. మత సామరస్యాన్ని ప్రతిబింబిస్తూ, అన్నదమ్ముల్లా కలిసి ఈద్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment