మెదక్ : బాలసదన్ లో విద్యార్థులకు నిత్యవసర వస్తువులు పంపిణీ.

|| దృశ్యం న్యూస్ ||

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ అదేశాల మేరకు పి. లక్ష్మీ శారద ఛైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, మెదక్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో బాలసదనంలో నిత్యవసర వస్తువుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో బాలసదనంలో ఉన్న పిల్లల చదువు, ఆరోగ్యం మరియు వసతుల గురించి తెలుసుకొని, వంటశాల కూడా తనిఖీ చేసి ఆహార నాణ్యత పై సంబంధిత అధికారులతో చర్చించడమైంది.

అనంతరం ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని బాలసదనంలో ఉన్న విద్యార్థులకు క్యాప్‌లు, పండ్లు మరియు బ్యాగ్‌లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో, కరుణశీల డీ.సీ.పీ.ఓ బాలనర్సిములు, లీగల్ అడ్వైసర్, బాలసదనం విద్యార్థులు, సిబ్బంది మరియు ఇతరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment