మానవత్వం చాటుకున్న మద్దుల్ తండావాసులు – వరద బాధితులకు అండగా నిలిచిన ఉదార హృదయాలు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ధర్పల్లిలోని ముత్యాల చెరువు తెగిపోవడంతో పరిసర ప్రాంతాలు తీవ్ర నష్టం చవిచూశాయి.

ఈ పరిస్థితిలో బాధిత బంజారా కుటుంబాల సహాయార్థం మద్దుల్ తండావాసులు ముందుకు వచ్చారు. మద్దుల్ తాండ నాయకులు, పెద్దమనుషులు, యువకులు కలిసి బీరప్ప తాండలో ప్రతి ఇంటికి బియ్యం, నిత్యవసర సరుకులు అందించారు. సహాయ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తూ, మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment