|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్ సందర్భంగా మొత్తం 4,898 కేసులు రాజీ మార్గంలో పరిష్కరించబడినట్లు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన రూ. 20,96,406 మొత్తాన్ని 111 సైబర్ క్రైమ్ బాధితులకు తిరిగి అందించేందుకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ లోక్ అదాలత్ లో
IPC & BNS కేసులు: 372
సైబర్ క్రైమ్ కేసులు: 111
ఇ–పెట్టి కేసులు: 2,064
DD & MV యాక్ట్ కేసులు: 2,351
మొత్తం: 4,898 కేసులు పరిష్కరించబడ్డాయి అని తెలిపారు.
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, లోక్ అదాలత్ ప్రజలకు త్వరిత న్యాయం అందించే వేదిక అని, చిన్నచిన్న వివాదాలను పెండింగ్‌లో ఉంచకుండా రాజీ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. క్షణికావేశంలో జరిగే తప్పులను సరిదిద్దుకునే మంచి అవకాశమిదన్నారు.
అదేవిధంగా TSCSB డైరెక్టర్ శిఖా గోయల్, మార్గదర్శకత్వంలో జిల్లాలో సైబర్ నేరాలపై వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సూచిస్తూ,
ఈ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసిన
ACP వెంకటేశ్వర్ రావు, CI ముఖిద్ పాషా, CCRB CI అంజయ్య, కోర్ట్ డ్యూటీ సిబ్బంది మరియు సైబర్ సెల్ టీమ్‌ను కమీషనర్ అభినందించారు.








