|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ మాత ఆలయాన్ని సందర్శించారు. వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మంగళ, శుక్ర, ఆదివారాలు దర్శన సౌకర్యాలను సమీక్షించారు. భక్తులకు ఎండ నుండి ఉపశమనం కల్పించేందుకు రాజ గోపురం నుంచి ఆలయం వరకు చలువ పందిళ్లు వేగంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. త్రాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని ఆలయ ప్రాంగణం శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాపన్నపేట తాసిల్దార్ సతీష్, ఆలయ ప్రధాన పూజారి శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.








