|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టేందుకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దృఢమైన చర్యలు ప్రారంభిస్తూ, మెదక్ ఎస్పీ, డీఎస్పీ, అలాగే రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇకపై జిల్లాలో ఎటువంటి అక్రమ ఇసుక రవాణా లేదా తవ్వకాలు జరగకూడదని ఎమ్మెల్యే హెచ్చరించారు.
గత పదేళ్లుగా బీఆర్ఎస్ నాయకులు ఇసుక మాఫియాను ప్రోత్సహించారని, మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో కూడా మెదక్ ప్రాంతంలో ఇసుక దోపిడీ జరిగినట్లు ఆరోపిస్తూ, ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యమని, ప్రజల నష్టానికి దారితీసే అక్రమ కార్యకలాపాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని రోహిత్ స్పష్టం చేశారు.
మెదక్ ప్రజల సహకారంతో ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియచేస్తూ, ఇసుక వనరుల సంరక్షణకు ప్రజల భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు.








