అంగన్వాడీ, హెల్పర్స్ మంత్రుల ఇండ్ల ముట్టడి – ముందస్తు అరెస్టులపై ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ ||

తెలంగాణ అంగన్వాడీ అండ్ హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల ఇండ్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బోధన్ పట్టణంలో సిఐటియు మాజీ జిల్లా ఉపాధ్యక్షులు, NPRD జిల్లా ప్రధాన కార్యదర్శి యేశాల గంగాధర్, బాలహంస రాజేశ్వరి, అనిత, దివ్య తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా యేషాల గంగాధర్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అంగన్వాడీ, ఆయా, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని కానీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా వేతనాల పెంపు, పర్మినెంట్ చేయడం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడం జరగలేదని విమర్శించారు.

అంగన్వాడీ టీచర్లకు రూ.26,000, ఆయాలకు రూ.18,000, ఆశా వర్కర్లకు రూ.18,000 వేతనం ఇవ్వాలని, అర్హులను ఏఎన్ఎంలుగా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే సిఐటియు ఆధ్వర్యంలో రైతులు, కార్మికులు, ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment